వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ జై రామన్ 3D స్టూడియోను సీతారామయ్య ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన 3D ఫోటోగ్రఫీ సేవలు అందించాలని స్టూడియో నిర్వాహకులను కోరారు. కాలనీవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభపడాలని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానికులు, అభిమానులు, పలు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here