శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్ గంగారంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి శేఖర్ ముదిరాజ్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.






