నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జడ్ సీ ని కోరారు. గురువారం జడ్ సీ రవి కిరణద ను శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కలిశారు. మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, ఇప్పటికే మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని చేపట్టనున్న అభివృద్ధి పనులపై జడ్ సీ తో చర్చించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వినతిపత్రాన్ని అందించారు.
