కాంగ్రెస్ పార్టీ గెలుపు.. జిన్నారం మున్సిపాలిటీ అభివృద్ధికి మలుపు: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ, జిన్నారం మున్సిపాలిటీ లోని 20 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కార్యాలయాలలో, మియాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు, జిన్నారం మండల స్థాయి నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై సమగ్రంగా చర్చించడం జరిగింద‌ని, ప్రతి వార్డులో పార్టీ స్థితిగతులు, బూత్ స్థాయి బలోపేతం, ఓటర్లతో మరింత సన్నిహిత సంబంధాలు కొనసాగించే విధానం, ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, సూచనలపై జిన్నారం మున్సిపాలిటీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ సవివరంగా సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా వార్డు సభ్యులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి నమ్మకం పెంచాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం సీనియర్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి, మియాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు మహమ్మద్ అన్వర్ షరీఫ్, మరపు గంగాధర్ రావు, బండారు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, గిరి, రోషన్, మహమ్మద్ ఖాజా, నరేష్, శివ, బాబురావు, సాంబయ్య, బాలు చౌదరి, ప్రసాద్, ముజీబ్, గణేష్ గౌడ్, చందు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here