ప‌రిశుభ్ర‌త‌, పారిశుధ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాలి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కొండాపూర్‌/ మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు కాల‌నీల్లో వారం రోజుల పాటు నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని శుక్ర‌వారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో డీసీ వెంకన్న, కార్పొరేటర్ హమీద్ పటేల్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశుభ్ర‌త‌, పారిశుధ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. ర‌హ‌దారుల‌పై చెత్త ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేయ‌కూడ‌ద‌న్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ర‌హ‌దారుల‌పై పేరుకుపోయిన చెత్తా చెదారం, మ‌ట్టిని తొల‌గించేందుకే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. ఇందుకు ప్ర‌జ‌ల స‌హ‌కారం కావాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ విశాలాక్షి, మెడికల్ ఆఫీసర్ రంజిత్, తెరాస నాయకులు శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, దీపక్ పాల్గొన్నారు.

గోల్డెన్ తులిప్ కాల‌నీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డీసీ వెంకన్న, కార్పొరేటర్ హమీద్ పటేల్

మియాపూర్‌లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని డీసీ సుధాంష్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏఎంవోహెచ్ రవి కుమార్, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, ఏఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, ప్రేమ్, శర్మ, డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు గంగాధర్, అన్వ‌ర్ షరీఫ్, మోహన్ ముదిరాజ్, బీఎస్ఎన్‌ కిరణ్ యాదవ్, గోపాల్ రావు, దాసరి గోపి కృష్ణ, విద్య సాగర్, బాబ్జి, శ్రీనివాస రావు, మహేందర్ ముదిరాజ్, జహంగీర్, రాజు, మల్లేష్, ప్రతాప్ రెడ్డి, కిషోర్, ప్రేమ్ కుమార్, దయానంద్, గురువయ్య, స్వామి నాయక్, హనుమంత్, రాజు, వంశీ, ఖాజా, చంద్రిక ప్రసాద్ గౌడ్, వరలక్ష్మి, రోజా, సుప్రజ పాల్గొన్నారు.

మియాపూర్ న్యూ కాల‌నీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డీసీ సుధాంష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here