హ్యూమ‌న్‌ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా క‌న‌క‌మామిడి సురేందర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హ్యూమ‌న్‌ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షునిగా హఫీజ్‌పేట్ గ్రామంకు చెందిన ప్ర‌ముఖ‌ న్యాయవాది క‌న‌క‌మామిడి సురేందర్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. క‌మిష‌న్‌ జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ గున్నాల అనీల్ రెడ్డిలు ఆదివారం సురేందర్ గౌడ్‌కు నియామకం పత్రాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా సురెంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి భాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు క‌మిష‌న్ జాతీయ అధ్య‌క్షుడు న‌ల్లా సంజీవ‌రెడ్డి, రాష్ట్ర చైర్మ‌న్ గున్నాల అనిల్ రెడ్డిల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రంలో మాన‌వ హ‌క్కులు, సామాజిక న్యాయం కోసం శ‌క్తిమేర కృషి చేస్తాన‌ని సురేంద‌ర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, రమేష్, విక్రాంత్, ప్రకాష్, సత్యం, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

సురేంద‌ర్ గౌడ్‌కు నియామ‌క ప‌త్రం అంద‌జేస్తున్న న‌ల్లా సంజీవ‌రెడ్డి, గున్నాల అనిల్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here