- ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 250 మందికి మాస్కులు, శానిటైజర్లు, గొడుగులను ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పేదలు, కార్మికులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగి ఉండడం చాలా గొప్ప విషయమని అన్నారు. సమాజ హిత కార్యక్రమాలు చేస్తున్న హోప్ ఫౌండేషన్ సేవలను గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.







