యువ‌తి పెళ్లికి హోప్ ఫౌండేషన్ ఆర్థిక స‌హాయం

గచ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ కి చెందిన శ్రీ లక్ష్మి అనే యువతి పెళ్లి ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంగా రూ.5వేల నగదును ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో ఆమె కుటుంబానికి అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. యువతి పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయం అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్ సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. సమాజం కోసం ఏదో చేయాలనే తపన క‌లిగి ఉండ‌డం గొప్ప విషయం అని అన్నారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ని ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరూ సమాజం కోసం చేయూతనందించాలని పేర్కొన్నారు. సామాజిక దృక్పథంతో సమాజ సేవచేయడానికి ముందుకురావడం అభినందించదగ్గ విషయం అని అన్నారు. ప్రతి ఒక్కరు కొండా విజయ్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎంతో మందికి ఆయ‌న ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నార‌ని అన్నారు. సమాజానికి సేవ చేసేందుకు కొండా విజయ్ ఎల్లవేళలా ముందు ఉంటారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు రూ.5వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here