ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉపాధ్యాయుల‌కు స‌న్మానం

శేరిలింగంప‌ల్లి‌‌‌ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ అభినందన సన్మాన సభ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు వి.ఆంజనేయులు, ఎ.ఆచారిల‌ను ఆయ‌న స‌న్మానించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ మాట్లాడుతూ ఎంద‌రో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు దైవంతో స‌మానులు అని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శంకర్, సీనియర్ ఉపాధ్యాయులు మహేంద్ రెడ్డి, భాస్కర్ యాదవ్, బలరాం, ధనరాజ్, జె.కృష్ణయ్య, ఉదయకుమారి, రమణ కుమారి పాల్గొన్నారు.

ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉపాధ్యాయుల‌ను స‌న్మానించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here