శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): PAIRS ఫౌండేషన్, అగ్ని (వహ్ని) కుల క్షత్రియ సేవా సంస్థాన్ KPHB, కిరణం హైస్కూల్, బొల్లారం, SRKVSSKPHB ల సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. JNTU ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖరయ్య, మొకా మీరాసాహెబ్, కరెస్పాండంట్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, స్వామి వివేకానంద స్ఫూర్తి, సాహిత్యంలపై 160 పుస్తకాలను వితరణ చేశారు. ఏకాగ్రత సాధన ద్వారానే స్వామీజీలా ఉన్నత ప్రతిభతో విద్యార్థులు వర్ధిల్లాలని సందేశం ఇచ్చారు. జాతీయ క్యాలెండర్ ననుసరించి స్వామీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన శ్రీమాశారదా ధ్యానమందిరం, ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలలో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించాలని అభిలషిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులుచే స్వామి వివేకానంద వందన గీతాలను బృంద గానంగా పాడించారు. విద్యార్థులకు స్వామీజీ జీవిత చరిత్ర, సందేశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసం అందరినీ అలరించింది.






