శేరిలింగంపల్లి, జనవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): తెల్లాపూర్ స్ఫూర్తి యోగాను నల్లగండ్ల నర్సరీ ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిరంతరాయంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకుడు భేరి రామచందర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు లక్ష్మణ్ గురువు ఆధ్వర్యంలో యోగాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కంజల శ్రీశైలం, కంజర మల్లయ్య, మన్నె మల్లయ్య, పెరుగు ఐలేష్ యాదవ్, కుమార్ గౌడ్, శ్యామ్ రావు, శ్రీనివాస్ గౌడ్, పాటిమీద కుమార్, కళ్లెం మోహన్ రెడ్డి, గొంగడి శ్రీనివాసరెడ్డి, మునగాల సత్యం, వడ్ల బ్రహ్మం, గట్టుపల్లి విష్ణు, కొండయ్య, శీను, చిలుకూరు ప్రభాకర్ యాదవ్, శంకర్, నరసింహ, టోనీ పాల్గొన్నారు.
