శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ కాలనీ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పదవీ విరమణ సభకు (రిటైర్మెంట్ ) ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న శ్రీనివాసులు కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆయన రాయదుర్గం కళాశాలకు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, ప్రధానాచార్యుడు శ్రీనివాసులు, సభాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, కళాశాల అధ్యపక, ఆధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.






