శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్లోని స్టాలిన్ నగర్ ఎంపీపీ (మండల ప్రాథమిక పాఠశాల) ప్రాంగణంలో అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ.. చెట్లను విరివిగా పెంచడం ద్వారా ప్రకృతిని కాపాడటంతో పాటు పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవచ్చని అన్నారు. పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రామప్రభు అన్నారు. మొక్కలు నాటడంతో కార్యక్రమం పూర్తికాదని, వాటిని క్రమం తప్పకుండా సంరక్షించినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి. నాగేశ్వర్, ఎస్. తిరుపతియమ్మ, ఎన్. సుష్మతో పాటు స్టాలిన్ నగర్ కాలనీ వాసులు మోహన్, దస్తప్పా, ప్రదీప్, సాయి గౌడ్, కోటంగారి శ్రీను, శరత్, రఘు గౌడ్, శేఖర్ ముదిరాజ్, వెంకటస్వామి, నర్సింహ, శ్రీకాంత్, శివ, కమల్, వేదాంత్, సతేష్, గని, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏఆర్పీ టీమ్ సభ్యులు అట్టేపల్లి సోమేశ్వర్, అడప అజయ్, అట్టేపల్లి ప్రశాంత్, అట్టేపల్లి చరణేష్, హరిబాబు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచుదాం.. ప్రకృతిని కాపాడుదాం.. ప్రగతికి బాటలు వేద్దాం అంటూ కార్యక్రమాన్ని ముగించారు.






