బోయినపల్లి వినోద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రూప్ సింగ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినోద్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మృదు స్వభావి, గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త, స్నేహశీలి బోయినపల్లి వినోద్ కుమార్ అని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో వేముల మారయ్య, కిషోర్ చారి, పెండెం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

బోయినపల్లి వినోద్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here