గిరిజనుల సమస్యలను పరిష్కరించండి – మంత్రి సత్యవతి రాథోడ్ కు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ వినతి

నమస్తే శేరిలింగంపల్లి: కొత్తగా ఏర్పాటు చేసిన తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి నిధులివ్వాలని, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయితీలలో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రనాయక్ విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం స్త్రీ, శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి తదితర సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్లావత్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ
ఎస్టీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగాల్లో 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచకుండా గిరిజన జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మియాపూర్ నడిగడ్డ తాండాలో గత 40 ఏండ్ల నుంచి ఉంటున్న గిరిజనులు సీఆర్పీఎఫ్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ , ఆంగోత్ హరి నాయక్, ఆల్ ఇండియా బంజారా సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం ఇస్తున్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here