శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవిందర్ గౌడ్ లు గాంధీని ఆయన నివాసంలో కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఆయనచే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.