కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గత ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు, తీవ్ర ప్రభావానికి లోను అయిన హనీఫ్ కాలనీ, మార్తాండ్ నగర్ కాలనీ ప్రాంతాలలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించారు. భారీ వర్షానికి తీవ్ర సమస్యలు ఏర్పడిన పలు ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పనులను చేయించి పరిష్కరించటం జరిగిందని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు.
జీహెచ్ఎంసీ అధికారులు డిప్యూటీ కమిషనర్ వెంకన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ రమేష్, డీఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ విశాలాక్షి, ఏఎంహెచ్ఓ డా.రంజిత్, ట్రాన్స్‌పోర్ట్ ఏఈ కిరణ్ కుమార్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలసి వర్ష ప్రభావిత ప్రాంతాలలో తిరిగి, సమస్యలు తెలుసుకొని, చేపట్టాల్సిన తక్షణ చర్యలు గురించి చర్చించటం జరిగిందని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. రానున్న రోజులలో లోతట్టు ప్రాంతాలు వర్షా కాలంలో జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా, ఉన్నతాధికారులతో కలసి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
కొండాపూర్ నుండి రాఘవేంద్ర కాలనీ మీదుగా వర్షపు నీరు లోతట్టు ప్రాంతం అయిన మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీలలోని ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, వార్డు మెంబర్ శ్రీనివాస్ చౌదరి, డివిజన్ తెరాస వైస్ ప్రెసిడెంట్ గఫుర్, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, తెరాస నాయకులు మహ్మద్ అలీ, బాబా, రజినీకాంత్, షబ్బీర్ అలీ, అయూబ్, సర్తాజ్, సలీం పటేల్, యూత్ నాయకులు దీపక్, శంకర్, సల్మాన్, షఫీ, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.