హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్‌లో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి… నాలుగు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన కార్పొరేట‌ర్లు, అధికారులు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలో రెండ‌వ‌రోజు శుక్ర‌వారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. సాయినగర్‌, యూత్‌కాల‌నీ, గంగారం, హ‌ఫీజ్‌పేట్‌ల‌లో జ‌రిగిన ఈ కార్య‌క్రమాల‌లో స్థానిక కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అధికారులు డిఈ సురేష్, ఏఈ ధీరజ్‌, ఉప‌వైద్యాధికారి డాక్ట‌ర్ కార్తిక్‌, ట్రాన్స్‌కో ఏఈ ఖాద్రి, జ‌ల‌మండ‌లి మేనేజర్ సుబ్రమణ్యంలు ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. స్థానికంగా నెల‌కొని ఉన్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెల‌సుకున్నారు. ప్రాధాన్య‌త క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్కారమ‌య్యేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. ప‌చ్చ‌ద‌నం ప‌రిర‌క్ష‌ణ‌, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ్‌ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కనకమమిడీ వెంకటేష్ గౌడ్, ఏరియా సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రాజు, సైయ్యద్ సత్తార్ హుస్సేన్, నాయకులు జ్ఞనేశ్వర్, దాస్, ఇస్మాయిల్, సంతోష్, సంపత్, లాలూ పటేల్,సైయ్యద్ ఇమ్రాన్, పాషా,ముజీబ్, ఎంటోమోలోజిస్ట్ గణేష్, ఎస్‌.అర్.పి గంగా రెడ్డి, ఎస్ఎఫ్ఏ సురేష్‌, ఎలక్ట్రికల్ కలీల్ తదితరులు పాల్గొన్నారు.

సాయిన‌గ‌ర్, యూతికాల‌నీలో సమ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్లు పూజిత, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్, నాయ‌కులు గౌతం గౌడ్‌, యాద‌గిరి గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here