శివాలయంలో ఘ‌నంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాయదుర్గంలోని మల్కం చెరువు శివాలయంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ మహాకాళేశ్వర లింగ సహిత మహా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ధ్వజస్తంభం, దంపత నవగ్రహాది ఆలయ శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకకు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ధర్మం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పరమేశ్వరుడి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

శివాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, వేద పండితులు, సేవకులు, సహకరించిన ప్రతి భక్తుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పరమేశ్వరుడు, మహా గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాల అనుగ్రహం ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ యాదవ్, దయాకర్, నరేందర్ ముదిరాజ్, సంజీవ్, శ్యామ్ యాదవ్, రాజు, శ్రీను, విజయ్ కుమార్, యువరాజ్, శ్రీనాథ్, ప్రవీణ్, ప్రభాకర్‌తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here