కేపీహెచ్‌బీ కాలనీలో ఘ‌నంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర‌.. మ‌త సామ‌ర‌స్యం చాటిన ముస్లింలు..

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేపీహెచ్‌బీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా రామసేన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీ రమ్య గ్రౌండ్ లో నిర్వహించిన హనుమాన్ విరాట్ శోభాయాత్రలో కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ ముస్లింలు పాల్గొని మ‌త సామ‌ర‌స్యం చాటారు. ఈ శోభయాత్రకు హాజ‌రైన భక్తులకు వాటర్ బాటిల్స్, చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్, నూర్ భాషా దూదేకుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు భాషా, టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ సత్తార్ ల‌ను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ‌ర్న‌లిస్టుల‌ను డిసిపి రితీరాజ్, కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి ఇంచార్జి బండి రమేష్ అభినందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రామ సేన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభ యాత్రలో పాల్గొన్న భక్తులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ అందించడమే కాక ప్రతి ఒక్క హిందువుని ఆప్యాయతంగా పలకరించి అలై బలై చేసుకున్నార‌ని తెలిపారు. భాషా, షేక్ సత్తార్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా పేరుపొందిన కేపీహెచ్‌బీ కాలనీలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను కలిసి జరుపుకుంటామని తెలియజేశారు. ఈ శోభా యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, స్థానికుడు మహబూబ్ (కచ్చిన్), సీనియర్ జ‌ర్న‌లిస్టుల‌ కరీం, నజీర్, గంగన్న, చంద్ర, రాము, రెహ్మాన్, ప్రవీణ్, షబ్బీర్, శివ, శ్యాం సుందర్, క్రాంతి కుమార్, బాల కృష్ణ, సునీల్, మహమ్మద్ హుస్సేన్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here