శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ సాంబ శివ పరమేశ్వర చిన్న పెద్దమ్మ దేవాలయ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కొండాపూర్ ప్రాంతంలో ఇంతటి భవ్యమైన దేవాలయాన్ని నిర్మించి, శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన చేయడం ధర్మ రక్షణలో ఒక గొప్ప అడుగు అని అన్నారు. భక్తిభావం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఆలయం స్థానిక భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.






