డాక్టర్ జి. ప్రణీత యాదవ్ కు గ్రాడ్యుయేష‌న్ డే అవార్డు ప్ర‌దానం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భాస్కర‌ మెడికల్ కాలేజ్ (BMC)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రేడియాలజీ విభాగం విద్యార్థుల‌కు నిర్వ‌హించిన గ్రాడ్యుయేషన్ డే లో తెలంగాణ ఉద్యమకారురాలు, ఉమెన్ టీజర్ ఫెడరేషన్ అధ్యక్షురాలు మన్యబోయిన రేణుక యాదవ్ కుమార్తె డాక్టర్ జి. ప్రణీత యాదవ్ అవార్డును అందుకున్నారు. బిఎంసి డీన్ డాక్టర్ పివి చలం చేతుల మీదుగా ప్ర‌ణీత యాద‌వ్ స‌ర్టిఫికెట్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్ర‌ణీత యాద‌వ్ కి పీజీ పట్టాను బహుకరించారు. అనంత‌రం డాక్టర్ ప్రణీత మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా తన‌ సేవలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేష్, హైదరాబాద్ జిల్లా టీజీవో అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షురాలు మన్నేబోయిన దుర్గా మాధవి యాదవ్, సూర్య ప్రకాష్ రావు, సరళ, ఎం.గోపాల్ యాదవ్, ఎంబీ విజయకుమార్ యాదవ్, ఎం.వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here