మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లు పాల్గొన్నారు. అంతకు ముందు వారు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

