శిల్పా గార్డెన్ అభివృద్ధికి కృషి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ‌పరిధిలోని శిల్పా‌ గార్డెన్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి కాలనీని‌ అన్ని విధాల అభివృద్ధి చేస్తామని శేరిలింగంపల్లి డివిజన్ ‌కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. కాలనీ‌‌ వెల్ఫేర్ అసోసియేషన్ ‌సభ్యుల వినతి మేరకు గురువారం‌ జీహెచ్ఎంసీ,‌ వాటర్ ‌వర్క్స్ అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శిల్ప గార్డెన్ లో పాదయాత్ర చేశారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శిల్పా గార్డెన్ కాల‌నీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

వాటర్ పైపులైన్, యూజీడీ, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పుడిప్పుడే ఈ కాలనీలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వీలైనంత త్వరగా పనులు చేపట్టేలా చూడాలని కోరారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మొదటగా వాటర్ పైపులైన్ వేసి నల్లా కనెక్షన్లు ఇచ్చి, యూజీడీ పైపులైన్లు వేశాక సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రజలకు అవసరమయ్యే కనీస మౌలిక వసతులను కల్పించేలా చూడాలని సూచించారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు.

కాల‌నీవాసుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్,‌ ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్, వాటర్ వర్క్స్ ఏజీఎం నివర్తి,
శిల్ప గార్డెన్ అసోసియేషన్ ‌అధ్యక్షుడు రామారావు, సెక్రటరీ రాం‌కిశోర్ యాదవ్, కోశాధికారి నరేంద్ర, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, పురం విష్ణువర్దన్ రెడ్డి, సాయి,‌ రేవంత్, సందీప్, శర్మ, లక్ష్మీనారాయణ, కిరణ్, సురేంద్ర, నాని, శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీశైలం, వెంకటేశ్వర్ రావు, ప్రవీణ్, వికాస్, కార్తీక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here