- మిరియాల ప్రీతమ్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వలన, వరద ముంపునకు గురై
సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడంతో వరద బాధిత కుటుంబాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాయని టీఆర్ఎస్ యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ అన్నారు. శనివారం చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్, శివాజీనగర్ లలో వరద బాధితుల కుటుంబాలకు రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు ముంపునకు గురైన పేద కుటుంబాలను ఆదుకోవడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.10 వేలను అందజేయడం జరుగుతుందన్నారు. వరదల వలన ఇండ్లలో పాడైన నిత్యావసర వస్తువులను, పిల్లలకు అవసరమైన పుస్తకాలను వెంటనే రూ.10 వేలతో కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ప్రతి వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందే విధంగా చూడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, నాయకులు వెంకట్ రావు, దూబే, వెంకటేష్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






