తారానగర్ లో అన్నపూర్ణాదేవిగా.. నెహ్రూ నగర్ లో గాయత్రీదేవిగా..

– శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడవరోజు అమ్మవారి దర్శనం

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ శ్రీ తుల్జాభవాని ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో పూజలు అందుకున్నారు. ఆలయ పాలకమండలి సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 శ్రీ అన్నపూర్ణా దేవి అవతారంలో దర్శనమిస్తున్న తారానగర్ తుల్జాభవాని మాత

నెహ్రూనగర్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు ఘనంగా కొనసాగాయి. సోమవారం అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తుంది నెహ్రూనగర్ రేణుక ఎల్లమ్మ తల్లి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here