శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): ఎన్నికల సంఘం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధి బీజేపీ ముఖ్య నాయకుల సమావేశాన్ని సోమవారం మసీద్బండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి కాలనీ, బస్తీ, బూత్ స్థాయిలో జరిగే ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)తోపాటు పార్టీ తరఫున నియమితులైన బీఎల్ఏ-2లు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి జాబితాలో ఉన్న లేని ఓటర్ల పేర్లను తొలగించడం, అర్హులైన నిజమైన ఓటర్లను జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు.

గతంలో దొంగ ఓట్ల తొలగింపు కోసం అనేకసార్లు పోరాటాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని, ప్రస్తుతం ఎన్నికల సంఘం సహకారంతో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే అవకాశం లభించిందని తెలిపారు. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దేందుకు ఇది మంచి అవకాశమని, పార్టీకి చెందిన ఆశావహులు, మాజీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, డివిజన్, కాలనీ, బస్తీ స్థాయి నాయకులు బీఎల్ఏ-2లకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బల్దా అశోక్, అజిత్, హనుమంత్ నాయక్, ప్రభాకర్ యాదవ్, పద్మ, ఎస్ఐఆర్ కన్వీనర్ మాణిక్రావు, అనిల్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, స్రవంతి, కృష్ణంరాజు, ఎల్లేష్, లక్ష్మణ్, వేణుగోపాల్ రెడ్డి, అరవింద్, ఆంజనేయులు, వరలక్ష్మి, గణేష్, సీతారామరాజు, మనిభూషణ్, జ్యోతి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





