నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డ్రైనేజీ నిర్వహణ పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. డ్రైనేజీ నిర్వహణ పనులను అక్టోబర్ ఒకటో తేదీన జీహెచ్ఎంసీ నుంచి జలమండలి శాఖకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఇరు శాఖల అధికారులతో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీ శనీవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జోనల్ కమిషనర్ రవి కిరణ్ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలసి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందచేశారు.
ఇరు శాఖల అధికారులు కొంతకాలం వరకు సహకరించుకుంటూ డ్రైనేజీ సమస్యలు, చేపట్టాల్సిన పనులపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ప్రజలకు ఈ విషయంలో అవగహన కల్పించి ఇకముందు డ్రైనేజి సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన అధికారుల వివరాలు తెలపాలన్నారు. డివిజన్ కు ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి కార్పొరేటర్ల ను అందులో యాడ్ చేసి ప్రజల నుండి వచ్చే వినతులు పరిష్కరించేలా కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించే డ్రైనేజీ నిర్వహణ వ్యవస్థను పటిష్టపర్చాలన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి హాజరవగా జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ ఈ చిన్నారెడ్డి, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతిని, డీఈలు రమేష్, సరిత, జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎంలు శ్రీమన్నారాయణ, నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్యం, నివర్తి, వెంకట్ రెడ్డి, యాదయ్య, సందీప్, సాయి చరిత, ఈశ్వరి, సునీత, ఎఎంఓహెచ్ రవి, కార్తిక్, ఏసీపీ సంపత్ తదితరులు పాల్గొన్నారు.