చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ శిల్ప ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకట హర చతుర్థిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, అర్చన, శ్రీ లక్ష్మీగణపతి హోమం, సాయంత్రం సిద్ధీ బుద్ధీ సమేత వరసిద్ధి వినయక స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
