మేడ్చల్ జిల్లా అక్రిడిటేషన్ సభ్యుడిగా గడ్డమీది బాలరాజు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మేడ్చల్ జిల్లా అక్రిడిటేషన్ సభ్యుడిగా జిల్లా టియుడబ్ల్యూజె అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు ఎన్నికైయ్యారు. జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనల మేరకు సమాచార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాస్ఫూర్తి ఎడిటర్ గా పని చేస్తున్న ఆయన జిల్లాలో చిన్న పత్రికల ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు యూనియన్ ప్రతినిధులు గా మోతె వెంకట్ రెడ్డి, రామారావు, బిగ్ పేపర్ ప్రతినిధిగా సునీల్, మీడియం పేపర్ ప్రతినిధిగా దిశ రవి, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులుగా ప్రసాద్, భూపాల్ లు నియమితులైయ్యారు. త్వరలోనే సమావేశం నిర్వహించి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిషన్ లు అందేలా చూస్తామని వారు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here