నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి గ్రామంలోని బస్తీ దవాఖానలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వారు నేరుగా మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ వద్దకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ను స్థానికంగా ఉన్న కమిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, స్కూళ్ళల్లో అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. సెంటర్ల వద్ద వ్యాక్సిన్ కోసం గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా ఉదయం 10 గంటల నుంచి ఒక్కో మొబైల్ సెంటర్ ద్వారా రోజుకి 500 నుంచి 600 మందికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ సెంటర్ లు ఉంటాయని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆధార్ వివరాలు తెలిపి వాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి, బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షుడు బి విటల్, కార్యదర్శి నరసింహారెడ్డి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం , వైస్ ప్రెసిడెంట్, శంకర్ నాయక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నగేష్, నవ చైతన్యం యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతన్య, కమిటీ మెంబెర్స్ నవీన్,ప్రవీణ్, దుర్గారావు, నాగేంద్ర, శివ, రాఘవ, దనుజయ్, మణికంఠ, సాయి సీనియర్ నాయకులు బాబు రావు, మన్నే రమేష్ గారు, నర్సింగ్ రావు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.