శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ట్రాఫిక్ సిఐ శ్రీ ప్రశాంత్, GHMC అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నాం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ చౌరస్తా మీదుగా నూతనంగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

మియాపూర్ అల్విన్ ఎక్స్ రోడ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కొండాపూర్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్‌ను తాత్కాలికంగా మదీనగూడ యూ-టర్న్ వద్ద (అల్విన్ సమీపంలో) ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించడం జరిగిందని, సుమారు 300 మీటర్ల దూరం వరకు ట్రాఫిక్‌ను మార్చి, మియాపూర్ వైపు ఉండే రైట్ టర్న్‌ను మూసివేశారని, దీంతో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఫ్రీ లెఫ్ట్ టర్న్‌ను అందుబాటులో ఉంచారని తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుందని, ఫ్రీ లెఫ్ట్ తీసుకోవడం వలన ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం , సుఖవంతమైన ప్రయాణం కోసం బాటలు వేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి, AE ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.





