భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ క్యాన్సర్ వ్యాధి అవగాహన దినోత్సవంను పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శనివారం భెల్ ఎంఐజీ కాలనీ కమ్యూనిటీ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ మెడి కవర్ హాస్పిటల్ కు చెందిన క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ భాను ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వ్యాధి పట్ల మహిళలకు అవగాహన కల్పించారు. వైద్యశాస్త్రం లో వచ్చిన పెను మార్పుల కారణంగా క్యాన్సర్ వ్యాధికి మందులు ఉన్నవని, వ్యాది తగ్గటానికి 90 శాతం అవకాశాలు ఉన్నయన్నారు. వ్యాధిని మొదటదశ లొనే గుర్తించగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని, ఒకప్పుడు ప్రపంచంలోనే ఖరీదైన వ్యాధి క్యాన్సర్ అని అన్నారు. మానవుడి తల వెంట్రుకల నుండి కాలిగోరుల వరకు శరీరంలో ఏ భాగంకు ఐన క్యాన్సర్ సోకవచ్చన్నారు. షుమారు 130 రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయని, భారతదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తుందన్నారు.

ఈ వ్యాధి రావటానికి కారణాలు పర్యావరణంలో వచ్చిన మార్పుల, ఆల్కహాల్ తీసుకోవటం, పొగాకు, పొగాకు ఉత్పత్తులు వాడకం, ఎండలో ఎక్కువగా తిరగటం వలన, కొవ్వు అధికంగా కలిగిన పదార్థాలు తినటం, అదేవిధంగా శారీరక శ్రమ లేకపోవటం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవటం వలన, కుటుంబంలో పూర్వీకులకు వ్యాధి ఉండటం వల్ల వారి రక్త సంబధికులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు. 35 సంవత్సరంలు దాటిన ప్రతి మహిళ ప్యాప్సిమియర్ , మెమోగ్రఫీ టెస్ట్లు విధిగా చేయుంచు కోవాలి అన్నారు. 50 సంవత్సరాలు పై బడిన మగ , ఆడ తేడాలేకుండా అందరూ కొలనోస్కోపిక్ పరీక్షలు చేయించు కున్నయడల వ్యాధిని తొలిదశలోనే గుర్తించవచ్చు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరూ 40 నిమిషాలు వ్యాయామం, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ చేయాలన్నారు. తాజా, పీచుపదార్థాలు కలిగిన ఆహారంను ఎక్కువగా తినాలి అన్నారు . రెడ్ మటన్ తినకూడదని, శరీరంలో వచ్చే మార్పులు గమనిస్తూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా సంభదిత వైద్యులను సంప్రదించి వారి సూచనలు , సలహాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి , సింధు ఆదర్శ్ మహిళా మండలి సభ్యులు రాణి , రాధ , శ్రీదేవి , వినోద , రజని తదితరులు పాల్గొన్నారు.





