ఉచిత వైద్య సేవలు అభినందనీయం: కార్పొరేటర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి నల్లగండ్ల లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, JCI సికింద్రాబాద్ WALKERS TOWN, JCI INDIA RISE UP 2025 ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ లోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ తోపాటు సుమిత్ గొయల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జెసీఐ ఇండియా, చతుర్వేది జోన్ ప్రెసిడెంట్ జెసీఐ ఇండియా జోన్ 12, వేణు గోపాల్ జోన్ వైస్ ప్రెసిడెంట్ రీజియన్ సీ జెసీఐ ఇండియా జోన్ 12, HGF ప్రెసిడెంట్ సుమతి, HGF సెక్రటరీ క్రాంతి హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ..పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే సంకల్పంతో సిటిజన్స్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి తగిన సేవలు అందించాలని సూచించారు. సమాజ శ్రేయస్సులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవల కోసం తనవంతు తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించడానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం జిహెచ్ఎంసీ శానిటేషన్ ఎస్ఆర్పి, ఎస్ఎఫ్ఏ, వర్కర్స్ ను కార్పొరేటర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్దం కొండల్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కుమారి, లక్ష్మి, జయ, అరుణశ్రీ, సాయి, రవి, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here