శేరిలింగంప‌ల్లి అభివృద్ధికి ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, విద్యుత్, స్ట్రీట్ లైట్స్, ఇతర విభాగం అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషితో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని,అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GK దుర్గా ప్రసాద్, DE ఆనంద్ , టౌన్ ప్లానింగ్ అధికారులు శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ తులసి రామ్, ఏసీపీ వేంకట రమణ, TPS రవీందర్, TPS జిషాన్, ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ EE మల్లికార్జున్, DE కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here