ప్ర‌తి వ‌ర‌ద బాధిత కుటుంబానికి ఆర్థిక స‌హాయం

  • తెరాస నాయ‌కులు మిరియాల రాఘవరావు, మిరియాల ప్రీతమ్

చందానగర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక స‌హాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేయడం జరుగుతుంద‌ని పార్టీ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు, టీఆర్ఎస్ యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ అన్నారు. మంగళవారం డివిజన్ ప‌రిధిలోని రాజీవ్ నగర్, ఇంద్రానగర్ లో వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక స‌హాయాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

బాధితులకు రూ.10వేలు అంద‌జేస్తున్న మిరియాల రాఘవరావు, మిరియాల ప్రీతమ్

వరద బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక స‌హాయం అందజేయడంతో ఆ కుటుంబాల కళ్ళలో ఆనందం కనిపిస్తోందన్నారు. ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ సహకారంతో వరద బాధిత కుటుంబాలను గుర్తించి, ఆ కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం కింద రూ.10 వేలను అందజేయడం జరుగుతుందన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50 వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 1 లక్ష ఆర్థిక స‌హాయాన్ని ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. వరదల వలన నష్టపోయిన ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుబ్బారావు, యాదయ్య, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here