శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో ఉన్న పేద వర్గానికి చెందిన రెడ్డి కులస్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని, వారి కోసం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఆర్ఏ ప్రతినిధులు సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన కిషన్ రెడ్డి.. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏఐఆర్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, కోశాధికారి కాంరెడ్డి రాము, ఉపాధ్యక్షురాలు కాంరెడ్డి కిరణ్మయి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎం.చంద్రశేఖర్ రెడ్డి, బి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.






