శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాల కల్పన కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

తెలంగాణ విద్యార్థుల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య చేపడుతున్న ఉద్యమానికి తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భేరి రామచందర్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కొనసాగుతున్న దీక్షకు విశేష స్పందన లభించిందని, విద్యార్థుల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం భేరి రామచందర్ యాదవ్ ఆర్. కృష్ణయ్యను కలిసి ఆయన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్.కే. సాయన్న ముదిరాజ్, మేదరి మహేంద్ర సంఘం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు కొంటు ముకుందం, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, బీసీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, గండి మైసమ్మ అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, పులి రాజేందర్, నోముల ప్రవీణ్ కుమార్, అన్నానగర్ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, ఉప్పల్ అధ్యక్షుడు ఎంవీఎస్ నాయక్, కీర్తికుమార్, కుల్చారం అధ్యక్షుడు మురళీధర్, గజ్వేల్ అధ్యక్షుడు ఇస్మాయిల్, యువజన అధ్యక్షుడు కొంటు సుమన్, సిద్ధార్థ ముదిరాజ్, శీను పటేల్‌తోపాటు పలువురు బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.





