గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో మాదాపూర్‌కు చెందిన మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బిపి, హార్ట్ రేట్, ఈసిజి తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ నందిత వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మారుతున్న మానవుడి జీవన శైలి క్రమంలో శారీరక శ్రమలేక మానసిక ఒత్తిడితో అనేక రుగ్మతలకు గురి అవుతున్నారని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 40 నిమిషాలు నడక, యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలన్నారు. సాధ్యమైనంత మేర తాజా ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు, చిరుధాన్యాలు, గుడ్లు, చేపలు తదితర పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 110 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాసీం, నిరంజన్ రెడ్డి, డాక్టర్ రామారావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, రామ్మోహనరావు, నల్లగొర్ల శ్రీనివాసరావు, హాస్పిటల్ ప్రతినిధి సిద్ధార్థ పాల్గొన్నారు.