స‌మాజంలోని పేద‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌హాయం చేయాలి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్‌ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కి చెందిన పేద మహిళలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అలాగే చందానగర్ డివిజన్ లోని చందానగర్ కి చెందిన కేఎస్‌ చక్రవర్తి అనే వ్య‌క్తికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 లను అందజేశారు.

మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్‌ల‌ను అంద‌జేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. హోప్ ఫౌండేష‌న్ లా ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు వ‌చ్చి స‌మాజంలోని పేద‌ల‌కు చేయూత‌ను అందించాల‌ని, వారికి అవ‌స‌ర‌మైన స‌హాయం చేయాల‌ని అన్నారు. కొండా విజ‌య్ కుమార్ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు. స‌మాజానికి ఏదో ఒకటి చేయాల‌నే త‌పన క‌లిగి ఉండ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. కొండా విజ‌య్ కుమార్ పేద‌ల‌కు సేవ చేసేందుకు ఎల్ల‌ప్పుడూ ముందు ఉంటార‌ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, చాంద్ పాషా, రామేశ్వరమ్మ, వెంకటేష్ పాల్గొన్నారు.

వైద్య ఖ‌ర్చుల కోసం రూ.10వేల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here