చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అధికారులు తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ నాయకులను స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి, బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిమిత్తం తయారు చేసిన ఓటరు లిస్టు లోపభూయిష్టంగా ఉందని, తప్పులు సరిదిద్దాలని భారతీయ జనతా పార్టీ అధికారులను కలవడానికి ప్రయత్నిస్తే ఇంటివద్దనే తమను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దమనకాండ, పాశవిక అరెస్టులతో ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోపుగొండ మహిపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

మియాపూర్‌లో…
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ నాయకులు టి రవి గౌడ్, మాణిక్యరావు, ఆకుల లక్ష్మణ్, విజేందర్ సింగ్, రత్నకుమార్, ప్రభాకర్, ప్రకాష్, రాజశేఖర్, ప్రసాద్ లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
