శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ గ్రేస్ , స్క్రీన్ ఫర్ లైఫ్ అనే థీమ్ తో నిర్వహించిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్( 10K,5K,2K) ఎనిమిదో ఎడిషన్ ను మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లక్షలాది మందిని కబళిస్తున్న కాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మనందరి పై ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఏదీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. సమాజంలో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. చినబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.






