శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌలిదొడ్డి వార్డ్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతిపిత మహాత్మాగాంధీ, భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పరాయి పాలకుల చేతిలో అడగడుగునా వివక్షకు గురై ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమతో స్వాతంత్య్రం లభించిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకనుగుణంగా భారతదేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో, గచ్చిబౌలి డివిజన్ లోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు , కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు , కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






