శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం స్వర్ణకార సంఘానికి గాను నూతన సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా మారోజు ప్రభాకర చారి ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా అంబిడి రఘుచారి, ప్రధాన కార్యదర్శిగా పవిత్ర ఆంజనేయులు చారి, సహాయ కార్యదర్శిగా బసవాపురం నరేంద్ర చారి, కోశాధికారిగా పసుమాముల శ్రీధర్ చారి, గౌరవ సలహాదారుగా వలబోజు మాణిక్యాచారి, సలహా మండలి సభ్యులుగా గోవింద రావు, వలబోజు రవికాంత చారి, పిడిశెట్టి వేణుగోపాల్ రావు, వలబోజు శ్రీకాంత్ చారి, సుంకోజు సంతోష్ చారి, నడిమింటి యాదగిరి చారిలను ఎన్నుకున్నారు.






