శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ స‌మ‌స్య‌ల పరిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మే 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ, మంజీరా మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, మంజీరా మంచినీటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ వాసులు సాంబయ్య, నరేష్, హనుమంత్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here