శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా బస్తీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నడిగడ్డ తండా బస్తీ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తండా బస్తీ అసోసియేషన్ వాసులు బస్తీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, బస్తీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా బస్తీ అధ్యక్షుడు హనుమంత్ నాయక్, నాయిని రత్నాకర్, చందు యాదవ్, దేవ నాయక్, మధు, లక్పతి, లక్ష్మణ్ నాయక్, సుధాకర్, కృష్ణ నాయక్, సోమేశ్వరరావు, అబ్రహాం, రవీందర్ నాయక్, తిరుపతి రాథోడ్, కమలాకర్, ఆంజనేయులు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






