శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): జగద్గిరిగుట్ట సగర సంఘం సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట సగర సంఘం అభివృద్ధికి నిరంతరం శక్తివంచనతో కృషి చేయాలని , అందరి సమిష్టి కృషి తో సగర సంఘం అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. జగద్గిరిగుట్ట సగర సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని , వారికి అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ నాయకులు జి సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంతరావు, జగద్గిరిగుట్ట సగర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






