శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ నారాయణి నాట్యాలయ గురువు సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, షణ్ముఖ, కౌతం, జతిస్వరం, శబ్దం, దేవి కీర్తనం, రామ భజన, కీర్తనం, కృతి, తిల్లాన, మంగళం అంశాలను ఉర్విజ, సోమా , అవ్య, పార్వతి, యోహానా, హర్షిత రెడ్డి, రుచిత, శ్రీ చందన, భవ్య, పద్మ ప్రదర్శించి మెప్పించారు.






