శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన కాలనీ లో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులతో కలిసి కాలనీ లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వర్షపు నీరు కోసం స్టార్మ్ వాటర్ లైన్ కావాలని అడుగగా అధికారులతో సమీక్షించి నూతన లైన్ నిర్మాణం కోసం అంచనాలు సిద్ధం చేయాలని చెప్పారు. పార్క్ సమస్యను, నీటి మోటార్ల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






