శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ నుండి దీప్తి శ్రీ నగర్ కాలనీ వరకు తలెత్తి డ్రైనేజ్ సమస్యను జలమండలి GM శ్రీనివాస్ రెడ్డి, DGM నారాయణతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ నుండి దీప్తి శ్రీ నగర్ కాలనీ వరకు తలెత్తిన డ్రైనేజ్ సమస్యను జలమండలి అధికారులతో కలిసి పరిశీలించి సమస్యను పరిష్కరించడం జరిగిందని, దీప్తి శ్రీ నగర్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, పొంగుతున్న మ్యాన్ హోల్ ల వద్ద పునరుద్ధరణ చేస్తామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని వివరించారు. మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని, కాలనీ వాసులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.






